Header Banner

పాలిట్ బ్యూరో సమావేశం! ఆపరేషన్ సింధూర్ వేళ చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!

  Sat May 10, 2025 12:45        Politics

ఆపరేషన్ సింధూరతో దేశ వ్యాప్తంగా పరిస్థితులు ఒక్క సారిగా మారిపోయాయి. ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది. భారత్ నిర్ణయానికి పార్టీలకు అతీతంగా అందరూ మద్దతుగా నిలిచారు. ఆ తరువాత సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతు న్నాయి. డ్రోన్లతో, మిసైల్లతో భారత్ లోని పలు నగరాల పైన దాడికి పాక్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ సమర్ధవంతంగా తిప్పి కొడుతోంది. ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా మంత్రాంగం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.

 

ఇండియన్ ఆర్మీకి ప్రజలంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ తొలి మహానాడుకు సిద్దమైంది. వ్యూహాత్మకంగా కడపలో ఈ సారి మహా నాడు నిర్వహణకు ఎంపిక చేసారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27,28,29 తేదీల్లో నిర్వహణకు నిర్ణయించారు. కాగా, ఇప్పుడు దేశం మొత్తం యుద్ద వాతావరణంలో ఉన్న ఈ సమయంలో పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించటం సరి కాదనే అభిప్రాయం టీడీపీ సీనియర్ల నుంచి వినిపిస్తోంది.

 

దీంతో, మమానాడు పై పార్టీ పునరాలోచనలో పడింది. మహానాడుతో పాటుగా పార్టీలో పదవులు.. ప్రక్షాళన దిశగా తీసుకునే నిర్ణయాల పై చర్చించేందుకు పార్టీ పాలిట్ బ్యూరో సమావేశానికి చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 14న టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ భేటీలో మహానాడు నిర్వహణ పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. మహానాడుకు ఇంకా సమయం ఉండటంతో ఈ లోగా పరిస్థితుల్లో మార్పు వస్తే యథాతధంగానే నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు. పరిస్థితుల్లో మార్పు లేకుంటే వాయిదా వేయటం లేదా ఒక రోజుకే పరిమితం చేయాలనే ప్రతిపాదన పైన పాలిట్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసు కునే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా పార్టీ పదవుల విషయంలోనూ చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. యువత - సీనియర్ల కాంబినేషన్ తో పార్టీ నాయకత్వం నిర్వహించేలా టీంకు తుది రూపు ఇవ్వనున్నారు.

 

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #Chandrababu #TDP #OperationSindoor #PolitburoMeeting #PoliticalDecisions #BreakingNews #AndhraPolitics